America: వ‌ణికిపోతున్న అగ్ర‌రాజ్యం.. ప్ర‌మాదంలో ఐటీ ఉద్యోగుల భ‌విష్య‌త్‌!

America: ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితులే తొలగింపునకు కారణమని స్పష్టం

Update: 2024-01-24 03:54 GMT

America: వ‌ణికిపోతున్న అగ్ర‌రాజ్యం.. ప్ర‌మాదంలో ఐటీ ఉద్యోగుల భ‌విష్య‌త్‌!

America: ద్రవ్యోల్బణం వంటి అంశాలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతుంది. ముఖ్యంగా జాబ్ మార్కెట్‌పై వీటి ప్రభావం ఎక్కువగా పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బ‌డా బ‌డా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొల‌గిస్తున్నాయి. దీంతో 2024 జాబ్ మార్కెట్ మ‌రింత దారుణంగా త‌యార‌య్యే ప‌రిస్థితులు ఏర్పడే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటి దెబ్బకూ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

2022తో పోలిస్తే 2023లో అమెరికాలో ఉద్యోగాల కోత 98 శాతం పెరిగినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ ఒక రిపోర్టులో తెలిపింది. ద్రవ్యోల్బణం, ఫెడరల్‌ వడ్డీ రేట్ల పెంపు పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేని నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితులే అమెరికాలో ఉద్యోగుల తొలగింపున‌కు కారణమని స్పష్టం చేశాయి.

Tags:    

Similar News