అమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

Update: 2020-11-04 06:50 GMT

అమెరికా ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. అభ్యర్థుల మధ్య అధ్యక్ష పోరు పోటాపోటీగా సాగుతోంది. ఇప్పటివరకు బైడెన్‌ 223 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా ట్రంప్‌ 212 ఓట్లు సాధించారు. ప్రస్తుతం బైడెన్ ఆధిక్యం కొనసాగుతుండగా కీలక రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ జరుగుతుండటంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బైడెన్‌ హవా కొనసాగుతూ వస్తోంది. అయితే స్వింగ్ రాష్ట్రాల్లో మాత్రం ట్రంప్‌ మార్క్‌ కొనసాగుతోంది. ఇప్పటికే కీలక రాష్ట్రాల్లోని ఓహియో, ఫ్లోరిడాలను కైవసం చేసుకున్నారు ట్రంప్‌. జార్జియా, టెక్సాస్‌లోనూ ఆధిక్యం కనబరుస్తున్నాడు.

ఇక అమెరికా ఎన్నికల్లో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌. కీలక రాష్ట్రాల్లో తమ విజయం ఖాయమని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న స్థానాలు కూడా తమకే దక్కుతాయన్నారు. అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News