పుతిన్‌పై అమెరికా, ఈయూ ఆర్థిక ఆంక్షలు

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మూడో రోజు కొనసాగుతోంది.

Update: 2022-02-26 09:10 GMT

పుతిన్‌పై అమెరికా, ఈయూ ఆర్థిక ఆంక్షలు

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మూడో రోజు కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నాయి. ఇప్పటికే పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆస్తులను స్తంభింపజేస్తామని అమెరికా, ఐరోపా దేశాలు ప్రకటించాయి. అయితే పుతిన్‌ సంపద ఎంతో తెలియకుండా ఎలా స్తంభించేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు వ్లాదిమిర్‌ పుతిన్. 2017లోనే పుతిన్‌కు 200 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నట్టు తెలిసింది. పలు షెల్‌ కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌, బినామీల పేరుతో పుతిన్‌కు భారీగా ఆస్తులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అతడి సంపద ఎంత ఉందనేదానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో పుతిన్‌పై ఆంక్షలను ఎలా విధిస్తారోననే నిపుణులు చర్చించుకుంటున్నారు.

పుతిన్‌ సంపద అంచనాలు ఏడాదికి ఏడాదికి మారుతున్నాయి. 2012లో పుతిన్‌కు 70 బిలియన్‌ డాలర్ల సంపద ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఫోర్బ్స‌ సంపన్నుల జాబితాలో పుతిన్‌ 20వ స్థానంలో నిలవడం గమనార్హం. అనేక రష్యన్‌ కంపెనీలతో పాటు ప్రధానంగా చమురు రంగంలో పుతిన్‌కు భారీగా వాటాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే క్రెమ్లిన్‌ లెక్కల ప్రకారం పుతిన్‌ వార్షిక ఆదాయం లక్షా 40వేల డాలర్లు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌తో పాటు రెండు సోవియట్‌ కాలపు కార్లు, మరో రెండు వాహనాలు మాత్రమే పుతిన్‌కు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే అమెరికా, యూరోప్‌ దేశాల్లో పుతిన్‌ ఆస్తులు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పుతిన్‌కు భారీ ఆస్తులు ఉన్నట్టు రష్యాలోని ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ఆరోపిస్తున్నారు. నల్లసముద్రంలో పుతిన్‌కు 1.4 బిలియన్‌ డాలర్ల విలువైన ప్యాలెస్‌ ఉన్నట్టు తెలిపారు. భూగర్బ ఐస్‌ రింక్, రెండు హెలిప్యాడ్‌లు, ఆర్బోరేటమ్‌, క్యాసినో, యాంపిథియేటర్‌ ఉన్నాయని.. కానీ.. అవి పుతిన్‌ పేరిట లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో పుతిన్‌పై ఆంక్షల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News