సముద్రంలో కూలిన అమెరికా శిక్షణ విమానం

తూర్పు ఇంగ్లాండ్‌లో అమెరికా సైనిక విమానం ఒకటి కూలిపోయింది. బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం నుంచి శిక్షణా మిషన్‌లో భాగంగా ఎగిరిన యుఎస్ ఫైటర్ జెట్ సోమవారం ఉత్తర సముద్రంలో కూలిపోయిందని అమెరికాకు సమాచారం అందింది.

Update: 2020-06-15 14:34 GMT
f-15 aircraft (file image)

తూర్పు ఇంగ్లాండ్‌లో అమెరికా సైనిక విమానం ఒకటి కూలిపోయింది. బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం నుంచి శిక్షణా మిషన్‌లో భాగంగా ఎగిరిన యుఎస్ ఫైటర్ జెట్ సోమవారం ఉత్తర సముద్రంలో కూలిపోయిందని అమెరికాకు సమాచారం అందింది. విమానంలో ఒక పైలెట్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని గురించి ఎలాంటి ఆచూకీ తెలియలేదని వారు వెల్లడించారు.

48 వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్ -15 సీ ఈగిల్ విమానం‌ RAF లాకెన్‌హీత్ స్థావరం నుండి బయలుదేరి సరిగ్గా ఉదయం 9:40 గంటలకు కుప్పకూలింది. ఈ విమానం తూర్పు యార్క్‌షైర్ తీరంలో 74 నాటికల్ మైళ్ల (137 కిలోమీటర్లు) కిందకు వెళ్లినట్లు బిబిసి పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. సమాచారం తెలుసుకున్న యూకే రెస్క్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 


Tags:    

Similar News