రెండు రైళ్లు ఢీ.. 35 మంది సజీవదహనం..
Greece: గూడ్స్‌రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు
Greece: సెంట్రల్ గ్రీసులో రెండు రైళ్లు ఢీ
Greece: గ్రీస్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ గ్రీస్ ప్రాంతంలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ట్రైన్‌లో 350 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రైళ్లు ఢీ కొట్టుకోవడంతో బోగీల్లో మంటలు చెలరేగి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో మంటలార్పేందుకు 17 అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. 40 అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.