Malaysia Airlines: మలేసియా ఎయిర్‌లైన్స్ విమాన దుర్ఘటనలో ట్విస్ట్
Malaysia Airlines: విమాన ప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు
Malaysia Airlines: మలేసియా ఎయిర్‌లైన్స్ విమాన దుర్ఘటనలో ట్విస్ట్
Malaysia Airlines: 2014 మార్చి 8న జరిగిన మలేసియా ఎయిర్‌లైన్స్ విమాన దుర్ఘటనపై సరికొత్త ఆధారాలు, సరికొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. 8 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉంటారన్న అనుమానాలు, సరికొత్త వాదనలు విన్పిస్తున్నాయి. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన శకలాలను పరిశీలించిన నిపుణులు ఈ మేరకు ఓ అంచనాకు వచ్చారు. ఇది ప్రమాదం కాదని...ఖచ్చితంగా పైలెట్లే ఉద్దేశపూర్వకంగా విమానాన్ని సముద్రంలో కూల్చివేశారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. MH-370 అనే ఈ విమానం 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్లే క్రమంలో అదృశ్యమైంది. దీంతో విమానం జాడను కనిపెట్టేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. విమానం జాడ కోసం సుమారు 1లక్షా, 20వేల చదరపు కిలోమీటర్ల మేర గాలించారు. అయినా విమానం జాడ దొరక్కపోవడంతో విమానంలోని 239 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించినట్లుగా అధికారులు ప్రకటించారు.