Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్..
Donald Trump: కాలమిస్ట్ జీన్ కరోల్‌కు 5 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందేనన్న కోర్టు
Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్..
Donald Trump: కాలమిస్ట్ ఇ జీన్ కరోల్‌పై లైంగిక వేధింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. కరోల్‌కు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. అంతేకాదు, కరోల్‌ను అబద్ధాల కోరుగా అభివర్ణిస్తూ ట్రంప్ ఆమె పరువును రోడ్డున పడేసినట్టు కూడా జ్యూరీ నిర్ధారించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగాలన్న ట్రంప్ ఆశలకు ఇది విఘాతం కలిగించే అవకాశం ఉంది. జ్యూరీ తీర్పుపై రీ అప్పీలుకు వెళ్లనున్నట్టు ట్రంప్ తరపు న్యాయవాది టకోపినా తెలిపారు.