Trump: 20లక్షల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన ట్రంప్ సర్కార్
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన బై ఔట్ ను ప్రకటించాచరు. అమెరికా ఫెడరల్ ఉద్యోగులు ఫిబ్రవరి 6వ తేదీలోగా తమ ఉద్యోగాలను వదిలివేయాలని స్వచ్చందంగా దీన్ని ఎంచుకున్న వారికి 8నెలల జీతం ఇవ్వనున్నట్లు పర్సనల్ మేనేజ్ మెంట్ కార్యాలయం నుంచి మెమో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికా ప్రభుత్వాన్ని పునర్నిర్మించే ప్రణాళికలో భాగంగా తీసుకుందని మెమో పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తనను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన మెయిల్ ను 20లక్షల మంది ఉద్యోగులకు పంపించారు. ప్రభుత్వ ఆఫర్ ను కనీసం 10 నుంచి 15 శాతం మంది ఉద్యోగులు ఎంచుకున్నా సరే ప్రభుత్వానికి ఏడాదికి 100 బిలియన్ డాలర్ల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ 19 మహమ్మారి తర్వాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. వారంతా కూడా వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు అంతకముందు జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను కూడా డొనాల్డ్ ట్రంప్ నిలిపివేస్తున్నారు. తాజాగా అనవసర ఖర్చులను అరికట్టేందుకు గాజాలో కండోమ్స్ పంపిణీ కోసం బైడెన్ ప్రభుత్వం కేటాయించిన 50 మిలియన్ డాలర్లను కూడా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది.