Donald Trump Pope AI Photo: పోప్ గా మారిన డొనాల్డ్ ట్రంప్.. వైరల్ గా మారిన ఫొటో

Donald Trump Pope AI Photo: పోప్ గా మారిన డొనాల్డ్ ట్రంప్.. వైరల్ గా మారిన ఫొటో
x
Highlights

Donald Trump Pope AI Photo: అమెరికా అధ్యక్షుడు Donald Trump ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ ఫోటోలో, ట్రంప్ పోప్ సాంప్రదాయ దుస్తులలో...

Donald Trump Pope AI Photo: అమెరికా అధ్యక్షుడు Donald Trump ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ ఫోటోలో, ట్రంప్ పోప్ సాంప్రదాయ దుస్తులలో కనిపించాడు. నిజమైన పోప్ కూర్చున్నట్లుగా సింహాసనం లాంటి కుర్చీపై కూర్చున్నాడు. అయితే ఈ ఫొటో నిజమైనది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్రియేట్ చేశారు. పోప్ వేషధారణలో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏఐ సాయంతో తయారైన ఈ చిత్రం వైరల్ గా మారి విమర్శలనూ, ప్రశంసలనూ మూటగట్టుకుందని న్యూస్ వీక్ పత్రిక తెలిపింది.

అమెరికా అధ్యక్షునిగా ఉన్న ఒక వ్యక్తి పోప్ వేషధారణలో కనిపించడం ఆనందదాయకంగానూ, గౌరవప్రదంగానూ లేదని పలువురు సోషల్ మీడియా యూజర్లు వ్యాఖ్యానించారు. పోప్ మరణించిన కొన్నాళ్లకే ఇలాటి వేళాకోళమడతారా అంటూ తప్పుబడుతున్నారు. బైబిల్ ప్రవచించిన పది నైతిక విలువలను పాతరేసిన ట్రంప్ ఇప్పుడు పోప్ వేషంలో కనిపించడం విడ్డూరంగా ఉందని డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా చట్టసభకు పోటీ చేసే ఓడిపోయిన మెలానీ డి అరిగ్రో అన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories