Tree Talks: మనుషులతో మాట్లాడే చెట్టు..ఎక్కడుందో తెలిస్తే షాక్ అవుతారు

Update: 2025-05-24 04:06 GMT

Tree Talks: మనుషులతో మాట్లాడే చెట్టు..ఎక్కడుందో తెలిస్తే షాక్ అవుతారు

Tree Talks: మనుషులతో మాట్లాడే చెట్టు గురించి తెలుసా. మనుషులతో చెట్టు మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అవును మేము చెప్పిదే నిజమే. ఈ చెట్టు మనుషులతో మాట్లాడుతుంది. ఈ చెట్టు ఎక్కడుందంటే..ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లోని ట్రినిటీ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతానికి ఆజ్యం పోశారు. టాకింగ్ ట్రీ అనే వినూత్న ప్రాజెక్టును చేపట్టడం ద్వారా మనుసఉలు నేరుగా చెట్లతోనే మాట్లాడే వీలు కల్పించే టెక్నాలజీని డెవలప్ చేశారు. చెట్ల నుంచి వెలువడే బయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ను ఏఏఐతోపాటు అధునాతన సెన్సర్ల సాయంతో మానవ భాషగా మార్చడం ద్వారా పర్యావరణ సంరక్షణకు సరికొత్త దారులను తెరిచారు. ఈ టెక్నాలజీ ద్వారా నేలలోని తేమ, పీహెచ్ స్థాయి, గాలిలోని తేమ, ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి పర్యావరణ అంశాలను ఈ సెన్సార్లు గుర్తిస్తాయి.

ఆ డేటాను చెట్టు నుంచి వెలువడే బయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తో సమన్వయం చేస్తారు. తర్వాత ఆ సిగ్నల్స్ ను ఏఐసాయంతో మానవ భాషలోకి ట్రాన్స్ లేట్ చేస్తారు. తద్వారా చెట్లు తమ అనుభవాలను మనుషులకు తెలిపే వీలు కల్పించారు. పర్యావరణ సంరక్షణే ప్రధాన లక్ష్యంగా డెవలప్ చేసిన ఈ టెక్నాలజీని శాస్త్రవేత్తలు ట్రినిటీ కాలేజీలోని 200 ఏళ్లనాటి లండన్ ప్లేన్ చెట్టుకు అనుసంధానించారు. తర్వాత ఓ వ్యక్తి ఆ చెట్టుతో మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Tags:    

Similar News