దయనీయంగా అప్ఘాన్ ప్రజల పరిస్థితి.. గాల్లోకి లేస్తున్న విమానం నుంచి జారిపడిన ప్రయాణికులు

Afghanistan: అప్ఘానిస్థాన్ లో పరిస్థితి క్షణ క్షణానికి దిగజారుతోంది.

Update: 2021-08-16 11:15 GMT

దయనీయంగా అప్ఘాన్ ప్రజల పరిస్థితి.. గాల్లోకి లేస్తున్న విమానం నుంచి జారిపడిన ప్రయాణికులు

Afghanistan: అప్ఘానిస్థాన్ లో పరిస్థితి క్షణ క్షణానికి దిగజారుతోంది. తాలిబన్లు దేశంపై పూర్తి పట్టు సాధించడంతో ఆదేశ ప్రజలు బతుకు భయంతో పారిపోతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఉండదన్న భయంతో మూటా, ముల్లె సర్దుకుని దొరికిన విమానం చేతబట్టుకుని దేశం విడిచి వెళుతున్నారు. ఇతర ప్రావిన్సులను తాలిబన్లు ఆక్రమించగానే కాబూల్ కు వలస వచ్చిన ప్రజలు ఇప్పుడు కాబూల్ కూడా తాలిబన్ల వశం కావడంతో ఇక దేశం వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వేలాది మంది కాబుల్ విమానాశ్రయం రన్ వే పైకి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. 

కొందరు విమానంలోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే టేకాఫ్ కావడంతో వారు గాలిలో విమానం టైర్లను, రెక్కలను పట్టుకుని వేళ్లాడుతూ కనిపించారు. విమానం గాల్లో ఎత్తుకు లేవగానే వారు కింద పడిపోయారు. జనం తొక్కిసలాటను నివారించేందుకు అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. ముందు తమ దౌత్య సిబ్బందిని అక్కడినుంచి తరలించేందుకు అమెరికా బలగాలు ప్రాధాన్యత నిస్తున్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టును యూఎస్ బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి.

Tags:    

Similar News