కోవిడ్-19 వ్యాక్సిన్ రావడం కష్టమే?డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. దీనికి వాక్సిన్ త్వరలోనే వస్తుందని అంతా భావిస్తున్నారు.

Update: 2020-05-05 12:53 GMT

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. దీనికి వాక్సిన్ త్వరలోనే వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులు చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్-19 నిపుణులు డాక్టర్ డేవిడ్ నబారో మాట్లాడుతూ.. కొన్ని దేశాల్లో 100కు పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నా, వాటిలో రెండు మనుషులపై ప్రయోగాల దశకు చేరుకున్నా ఆశాజనక ఫలితాలైతే కనిపించడంలేదని అంటున్నారు. కొన్ని వ్యాధులకు నేటికీ వ్యాక్సిన్ లేదు. వాటికి వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం కూడా లేదు.

కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా ఇంతేనేమో. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా సెఫ్టీ పరీక్షలన్నింటిలో నెగ్గుతుందన్న విశ్వాసం లేదు' అని డేవిడ్ నబారో అభిప్రాయపడ్డారు. అయితే హెచ్‌ఐవీ, డెంగ్యూ కొన్ని  వ్యాధులకు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నా వీటికి ఔషధాన్ని కనుక్కోలేకపోయారు. కోవిడ్-19 కూడా రాదేమో అని కలవరానికి గురిచేస్తుంది.

 

Tags:    

Similar News