Coronavirus: ఆ దేశంలో 2 మిల్లియన్ల ఉద్యోగాలు కోల్పోవచ్చు

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు కుప్పకూలడంతో థాయ్‌లాండ్ ఈ ఏడాది 2 మిలియన్ల వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆ దేశ ప్రణాళిక సంస్థ గురువారం తెలిపింది

Update: 2020-05-28 07:03 GMT

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు కుప్పకూలడంతో థాయ్‌లాండ్ ఈ ఏడాది 2 మిలియన్ల వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆ దేశ ప్రణాళిక సంస్థ గురువారం తెలిపింది. అలాగే మొత్తం 8.4 మిలియన్ల ఉద్యోగుల భవితవ్యం రిస్క్ లో ఉందని చెప్పింది.. ఇందులో ముఖ్యంగా పర్యాటక రంగంలో 2.5 మిలియన్లు, పారిశ్రామిక రంగంలో 1.5 మిలియన్లు, సేవా రంగంలోని ఇతర ప్రాంతాల్లో 4.4 మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని జాతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధి మండలి అధిపతి తోసపోర్న్ పేర్కొన్నారు.

ఈ సంవత్సరం 3% -4% నిరుద్యోగిత రేటు ఉంటుందని.. సాధారణంగా అయితే 1% ఉంటుందని చెప్పారు. 1997/98 ఆసియా ఆర్థిక సంక్షోభ సమయంలో చూసిన స్థాయిలో సంక్షోభం ఉంటుందని వెల్లడించారు. అయితే ఇది మే నుండి వ్యాప్తి పరిస్థితిని నియంత్రించగలదనే ఊహాగానాలపై ఆధారపడి ఉంటుందని కూడా వెల్లడించారు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News