భారత్‌లో టెస్లా కార్ల త‌యారీపై క్లారిటీ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మరోసారి భారత్‌లో ఆరోపణలు గుప్పించారు.

Update: 2022-05-28 13:30 GMT

భారత్‌లో టెస్లా కార్ల త‌యారీపై క్లారిటీ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మరోసారి భారత్‌లో ఆరోపణలు గుప్పించారు. టెస్లా కార్ల దిగుమతికి పన్ను రాయితీ ఇవ్వని కారణంగానే భారత్‌కు టెస్లా కార్లు రావడం లేదని స్పష్టం చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడే కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. దీనిపైనా మస్క్‌ క్లారిటీ ఇచ్చారు.

భారత్‌లో టెస్లా కార్ల యూనిట్‌ ఏర్పాటు చేసే ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు. అందుకు భారత్‌ విధానాలే కారణమంటూ మరోసారి ఆరోపించారు. తాజాగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సేవలకు ఇండోనేషియా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని మస్క్‌ చెప్పారు. 

Tags:    

Similar News