Afghanistan-Pakistan War: అఫ్గాన్ సరిహద్దులపై పాకిస్తాన్ సైన్యం దాడి
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఘర్షణలకు కేంద్ర బిందువుగా డ్యూరాండ్ రేఖ భారత్, అఫ్గాన్ సంబంధాలపై పాక్ అక్కసు అఫ్గాన్ సరిహద్దులపై పాకిస్తాన్ సైన్యం దాడి పాక్ దాడులకు తీప్పికొట్టిన తాలిబన్ల సైన్యం
Afghanistan-Pakistan War: అఫ్గాన్ సరిహద్దులపై పాకిస్తాన్ సైన్యం దాడి
ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య ఘర్షణలకు డ్యూరాండ్ రేఖ కేంద్ర బిందువుగా మారింది. భారత్ - అఫ్గానిస్తాన్‌ల మధ్య స్నేహబంధాన్ని చూసి సహించలేని పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల్లో పోరాటానికి దిగింది. దీన్ని అఫ్గాన్ తాలిబన్ సర్కారు ధీటుగా తిప్పికొట్టింది. ఎప్పటిలాగే తమదే పైచేయి అని పాక్ సైన్యం చాటుకోగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, దుస్తులు ప్రదర్శించి పరువు తీశారు అఫ్గాన్ ప్రజలు. మరోవైపు తాలిబన్లను ఒప్పించి శాంతి నెలకొల్పేలా చూడాలని ఖతార్, సౌదీ ప్రభుత్వాలను వేడుకుంటోంది పాకిస్తాన్.