NASA Astronauts: సునీతా విలియమ్స్, విల్‌మోర్ నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే భూమి మీదకు

Sunita Williams Return to Earth: సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ నిర్ధీత షెడ్యూల్ కంటే ముందే భూమి మీదకు తిరిగి రానున్నారు.

Update: 2025-02-12 07:04 GMT

NASA Astronauts: సునీతా విలియమ్స్, విల్‌మోర్ నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే భూమి మీదకు

Sunita Williams Return to Earth: సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ నిర్ధీత షెడ్యూల్ కంటే ముందే భూమి మీదకు తిరిగి రానున్నారు. అంటే 2025 మార్చి రెండో వారంలో ఈ ఇద్దరు వ్యోమగాములను భూమి మీదకు రప్పించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటివారంలో వీరిని అంతరిక్షం నుంచి కిందకు రప్పించేందుకు ప్లాన్ చేశారు. అంతరిక్షంలో చిక్కుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములను తిరిగి రప్పించేందుకు స్పేస్ ఎక్స్ 10 మిషన్ కోసం గతంలో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ను ఉపయోగించనున్నట్టు నాసా తెలిపింది.

సునీతా విలియమ్స్, బుచ్ మిల్ మోర్ 2024 జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అంతరిక్షానికి మానవసహిత రాకెట్ ప్రయాణానికి సంబంధించిన ప్రయోగంలో భాగంగా ఎనిమిది రోజుల టూర్ కోసం స్టార్ లైనర్ బోయింగ్ రాకెట్ లో చేరుకున్నారు. అంతరిక్షానికి చేరుకున్న తర్వాత సునీతా బృందం ప్రయాణించిన స్టార్ లైనర్ బోయింగ్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలతో అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్,విల్ మోర్ చిక్కుకున్నారు.

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావడానికి 2024 సెప్టెంబర్ 29న స్పేస్ ఎక్స్ క్రూ ప్రయోగించారు. ఇందులో హాక్, గోర్బునోవ్ అనే ఇద్దరు వ్యోమగాములను సానా పంపింది. వాస్తవానికి నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళ్లాలి. కానీ, ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్, విల్ మోర్ లను తిరిగి భూమి మీదకు తీసుకురావడం కోసం ఇద్దరు వ్యోమగాములను మాత్రమే స్పేస్ ఎక్స్ క్రూ లో పంపారు. స్పేస్ ఎక్స్ క్రూ 2025 ఫిబ్రవరిలో భూమి మీదకు తిరిగి రావాలి. కానీ, టెక్నికల్ కారణాలతో ఈ ప్రయోగం ఆలస్యమైంది.

సునీతా విలియమ్స్, విల్ మోర్ లను అంతరిక్ష కేంద్రం నుంచి రప్పించేందుకు అవసరమైన క్రూ 10 ప్రారంభించినట్టు నాసా ప్రకటించింది. మార్చి 12 నాటికి దీన్ని టార్గెట్‌గా ఏర్పాటు చేసుకున్నామని నాసా వివరించింది. NASA ప్రోటోకాల్స్ ప్రకారం క్రూ-10 వచ్చే వరకు క్రూ-9 స్టేషన్‌లోనే ఉండాలి. క్రూ-10కి మొదట కేటాయించిన డ్రాగన్ క్యాప్సూల్‌ను మార్చుకోవడం ద్వారా క్రూ 10 ను నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే భూమి మీదకు తీసుకు వచ్చేందుకు వీలు కల్పిస్తోంది.

Tags:    

Similar News