Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్న సునీత
Sunita Williams: ఐఎస్ఎస్‌కు చేరుకోవడంతో డ్యాన్స్ చేసిన సునీత
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్న సునీత
Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక విజయవంతంగా ISSకు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. ISSకు చేరుకున్న సునీత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది.