రెండు కొరియా దేశాల మధ్య కాల్పులు

మొన్నటివరకూ ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన రెండు దేశాలు ఇప్పుడు కాల్పులు చేసుకుంటున్నాయి.

Update: 2020-05-03 10:13 GMT

మొన్నటివరకూ ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన రెండు దేశాలు ఇప్పుడు కాల్పులు చేసుకుంటున్నాయి.దక్షిణ కొరియా - ఉత్తర కొరియా దళాలు ఆదివారం తమ సరిహద్దులో కాల్పులు జరిపినట్లు దక్షిణాది సైన్యం తెలిపింది, ప్రత్యర్థులు ఫ్రంట్-లైన్ లో బలగాలను తగ్గించడానికి ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిపింది. హింసాత్మక ఘర్షణలు అప్పుడప్పుడు సరిహద్దు వెంబడి జరుగుతుంటాయి, అయితే ఆదివారం అవి మరి శృతిమించాయి.. దాంతో ఇరువైపులా కాల్పులకు దారితీసింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ముందుగా సరిహద్దు రేఖ వద్ద ఉన్న దక్షిణ కొరియా గార్డుపై ఉత్తర కొరియా దళాలు కాల్పులు జరిపారని.. సియోల్‌లోని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపింది . దీంతో శత్రువులను తిప్పికొట్టేందుకు దక్షిణ కొరియా మొత్తం 20 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలిపారు. దక్షిణ కొరియాకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని మిలటరీ తెలిపింది. అయితే ఉత్తర కొరియా మాత్రం ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.



Tags:    

Similar News