కిమ్ మరణించినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన దక్షిణకొరియా

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ మరణించినట్టు వస్తున్న వార్తలను దక్షిణకొరియా ఖండించింది.

Update: 2020-04-27 05:38 GMT
Kim Jong Un

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ మరణించినట్టు వస్తున్న వార్తలను దక్షిణకొరియా ఖండించింది. కిమ్ ప్రస్తుతం గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యగంగానే ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ ముఖ్య సలహాదారు మూన్ చుంగ్-ఇన్ సిఎన్ఎన్ కు చెప్పారు. కొన్ని మీడియాల్లో కిమ్ చనిపోయినట్టు వస్తున్న వార్తలు నిరాధారమని.. కిమ్ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద కదలికలు కనుగొనబడ లేదని.. ఆయన సజీవంగానే ఉన్నారని చెప్పారు. శస్త్రచికిత్స చేయించుకొని ఏప్రిల్ 13 నుండి వోన్సాన్ ప్రాంతంలో రిలాక్స్ అవుతున్నారని స్పష్టం చేశారు.

కాగా కిమ్ చనిపోయారని గత రెండురోజులుగా సామాజిక మాధ్యమాల్లో రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను చైనా, దక్షిణ కొరియా ఖండించింది కానీ.. అధికారికంగా ఉత్తరకొరియా మాత్రం ఈ రూమర్లపై వివరణ ఇవ్వలేదు. తన తాత కిమ్ ఇల్-సుంగ్ జన్మదినానికి హాజరుకాకపోవడంతో కిమ్ జోంగ్ ఉన్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి చర్చ ప్రారంభం అయింది. అయితే అంతకుముందు ఏప్రిల్ 11 న సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పై మీడియా చివరిసారిగా కథనాలు ప్రసారం చేసింది.

Tags:    

Similar News