North Korea: కవ్వింపులు ఆపని కిమ్‌.. రెండు వారాల్లో ఆరు క్షిపణి పరీక్షలు

North Korea: అత్యవసర సమావేశం నిర్వహించిన సెక్యూరిటీ కౌన్సిల్

Update: 2022-10-06 06:09 GMT

North Korea: కవ్వింపులు ఆపని కిమ్‌.. రెండు వారాల్లో ఆరు క్షిపణి పరీక్షలు

North Korea: ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఇంకా ఆపడం లేదు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల విషయం వెలుగులోకి రాగానే దక్షిణ కొరియా సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. కవ్వింపు చర్యలను బలమైన ప్రతిస్పందన ఉంటుందని ప్యాంగ్యాంగును హెచ్చరించింది. ఇప్పటికే జపాన్ నగరంపై నుంచి క్షిపణిని ప్రయోగించిన నేపథ‌్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఉత్తర కోరియా చర్యలకు రష్యా, చైనాల నుంచి లభిస్తున్న రక్షణే కారణమని నిందించింది. దాదాపు రెండు వారాల వ్యవధిలో ఏకంగా ఆరుసార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించింది.

జపాన్ పైనుంచి క్షిపణి పరీక్షకు ప్రతిస్పందనగా జపాన్ - దక్షిణఫ కొరియా యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. వీటిని అమెరికా పూర్తిగా సమర్థించింది. నిషేధిత క్షిపణి పరీక్షలతో ఈ యుద్ధ విన్యాసాలను ఏమాత్రం పోల్చలేమని పేర్కొంది. అమెరికా భారీ ఎత్తున నౌకాదళ ఆయుధానలు కొరియా ద్వీపకల్పానికి తరలించింది. దీంట్లో భాగంగా అమెరికా విమాన నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రాగన్, దాని స్ట్రయిక్ గ్రూపును జపాన్ సముద్రానికి పంపింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ దీనిపై స్పందిస్తూ... ఇదొక అసాధారణ చర్య అని పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎటువంటి ముప్పునయినా నిర్ణయాత్మక శక్తితో ఎదుర్కొంటామన్నారు.

Tags:    

Similar News