Cat in Airport: ఈ పిల్లికి జీతం మీ కన్నా ఎక్కువ.. ఏం చేస్తుందంటే..!

Cat in Airport: ప్రతి కుక్కకీ ఒక రోజొస్తుంది అని జనరల్ గా మనం అంటూ ఉంటాం.

Update: 2023-06-26 05:36 GMT

Cat in Airport: ఈ పిల్లికి జీతం మీ కన్నా ఎక్కువ..ఏం చేస్తుందంటే..!

Cat in Airport: ప్రతి కుక్కకీ ఒక రోజొస్తుంది అని జనరల్ గా మనం అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దాన్ని మనం మార్చేయాలి. ప్రతీ పిల్లికీ ఒక రోజు వస్తుందని. నిజమండీ ఇది. ఎందుకంటే ఒక పిల్లికి వచ్చింది కాబట్టి. అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఎయిర్ పోర్ట్ లో ఒక అందమైన పిల్లి అటూ ఇటూ తిరుగుతోంది. అది ఎవరో పెంచుకుంటున్నది కాదు. ఆ ఎయిర్ పోర్ట్ వాళ్లు ఉంచుకుంటున్నదీ కాదు. అదక్కడ ఎంప్లాయ్. మరీ.. ఏమనుకుంటున్నారు! ఎంప్లాయా? అంటే పిల్లేం పని చేస్తుంది అని అవాక్కవుతున్నారా.

మనలో కొద్ది మందికి విమాన ప్రయాణాలు అంటే భయం ఉంటుంది కదా.. మొదటిసారి ఎక్కేవాళ్లకైతే మరీనూ. సో.. అలాంటి వాళ్ల దగ్గర కొద్దిసేపు ఉంచుతారట. దీనితో సరదాగా కొద్దిసేపు గడిపితే ఆ టెన్షన్ పోయి.. ప్రయాణీకులు రిలాక్స్ అవుతారట. అదీ ఈ పిల్లి చేసేది. దీన్ని ఆనిమల్ అసిస్టెడ్ థెరపీ అని అంటారట. అందుకేగా దానికి నెలకు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 4 లక్షలిస్తున్నారట.. భలేవుంది కదా..హూ... ఇది చూసి.. పిల్లినైనా కాకపోతిని.. 4 లక్షలొచ్చేవి నెలకు అని బాధగా పాట పాడుతున్నారట.. ఎయిర్ పోర్ట్ లోని మిగతా ఎంప్లాయిస్.

Tags:    

Similar News