రష్యా ప్రధానికి కరోనా పాజిటివ్..

మొన్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాభారిన పడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-05-01 02:02 GMT
Russia PM Mikhail Mishustin

మొన్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాభారిన పడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రష్యా ప్రధానికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. రష్యా ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించారని అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారని తెలిపారు.

మిషుస్టిన్ అధికారాలను ఉప ప్రధాని స్వీకరించాలని పుతిన్ ప్రతిపాదించారు. మిషుస్టిన్ కూడా అందుకు సిద్ధమయ్యారు. తాను కోలుకునే వరకూ తన బాధ్యతలను ఉప ప్రధాని చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రభుత్వ సమన్వయ మండలి సమావేశానికి ప్రధాని బుధవారం హాజరయ్యారు, ఇందులో రష్యా సరిహద్దులు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో ఖచ్చితమైన తేదీ ఇవ్వడం అసాధ్యం అని కూడా అన్నారు. అయితే హఠాత్తుగా ఆయనకు కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం మిషుస్టిన్ రష్యా ఆర్ధిక శాఖా బాధ్యతలు కూడా చూస్తున్నారు.

ఇదిలావుంటే 7,099 కొత్త అంటువ్యాధులతో గురువారం దేశంలో మొత్తం 100,000 ధృవీకరించిన కేసులను అధిగమించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి రష్యాలో 1,073 మంది మరణించినట్లు ఆ దేశ కరోనావైరస్ ప్రతిస్పందన ప్రధాన కార్యాలయం తెలిపింది.


Tags:    

Similar News