ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకారం: అత్యాధునిక 'హైపర్సోనిక్' క్షిపణితో విరుచుకుపడ్డ పుతిన్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసమే లక్ష్యంగా ఇటీవల జరిగిన డ్రోన్ల దాడికి క్రెమ్లిన్ ప్రతీకారం తీర్చుకుంది.

Update: 2026-01-09 07:34 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసమే లక్ష్యంగా ఇటీవల జరిగిన డ్రోన్ల దాడికి క్రెమ్లిన్ ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్‌పై అత్యంత వేగవంతమైన, విధ్వంసకర హైపర్సోనిక్ క్షిపణి 'ఒరెష్నిక్'ను ప్రయోగించినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది.

ఒరెష్నిక్ క్షిపణి ప్రత్యేకతలు ఇవే:

ఇది ధ్వని కంటే 10 రెట్లు వేగంతో (Mach 10) ప్రయాణించగలదు. అంటే దీనిని అడ్డుకోవడం ప్రస్తుతమున్న ఏ క్షిపణి రక్షణ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యం. రష్యా రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మిస్సైల్ పరిధిలోకి దాదాపు ఐరోపా ఖండంలోని అన్ని దేశాలు వస్తాయి. ఇది నాటో (NATO) దేశాలకు స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు. పుతిన్ నివాసంపై జరిగిన దాడికి ప్రతిస్పందనగానే ఈ అత్యాధునిక ఆయుధాన్ని వాడినట్లు రష్యా స్పష్టం చేసింది.

ఈ క్షిపణి ప్రయోగంతో యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. సాధారణ క్షిపణులకు భిన్నంగా హైపర్సోనిక్ ఆయుధాలను రష్యా వాడటం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News