Rahul Gandhi: అమెరికాలో ట్రక్కులో ప్రయాణించిన రాహుల్

Rahul Gandhi: వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌ వరకు సాగిన రాహుల్ ట్రక్ రైడ్

Update: 2023-06-14 05:04 GMT

Rahul Gandhi: అమెరికాలో ట్రక్కులో ప్రయాణించిన రాహుల్

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. డ్రైవర్‌ తల్జిందర్‌ సింగ్ అనే వ్యక్తి ట్రక్కులో రాహుల్ ప్రయాణించారు. వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌ వరకు రాహుల్ ట్రక్కు ప్రయాణం సాగింది. హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాల 295 పాటను అడిగి మరీ ప్లే చేయించుకున్నారు.

ట్రక్ ప్రయాణంలో భాగంగా అక్కడి డ్రైవర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్లు ఎలా పని చేస్తారు? నెలకు ఎంత సంపాదిస్తారు ? వారు నడిపే ట్రక్కులో ఉండే అత్యాధునిక ఫీచర్లు ఏంటి ? చలాన్లు పడతాయా.. స్పీడు ఎంత వెళ్తారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీటికి ఆ డ్రైవర్.. తాను నెలకు 8 లక్షలు సంపాదిస్తానని చెప్పారు. ఈ విషయం విని రాహుల్ గాంధీ ఆశ్చర్యపోయారు. భారత్‌లో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆ డ్రైవర్‌.. రాహుల్‌కు చెప్పారు. ట్రక్కును ఓ రెస్టారెంట్‌ వద్ద ఆపి... అక్కడ రెస్టారెంట్‌లో ఉన్న డ్రైవర్లతో కలిసి ముచ్చటించారు. వారిని ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు.

గత నెలలో ఢిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్లే క్రమంలో రాహుల్‌ గాంధీ లారీలో ప్రయాణించారు. లారీలో డ్రైవర్‌ పక్కన కూర్చున్నారు. ఓ దాబా వద్ద ఆగి డ్రైవర్లతో ముచ్చటించారు. అంబాలా - చండీగఢ్ జాతీయ రహదారి వెంబడి అంబాలాలో ఉన్న గురుద్వారానూ రాహుల్ సందర్శించారు. అంతకుముందు ఓ డెలివరీ బాయ్ స్కూటర్ ఎక్కి ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లోనూ ప్రయాణం చేసి మహిళలతో ముచ్చటించారు.

Tags:    

Similar News