PM Modi: పాక్ విషయంలో ట్రంప్‌కు ఏం సంబంధం లేదు.. కుండబద్దలు కొట్టిన మోదీ..!!!
PM Modi: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల తామే ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమధ్య పదే పదే చాటుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర చర్చ నడిచింది.
PM Modi: పాక్ విషయంలో ట్రంప్‌కు ఏం సంబంధం లేదు.. కుండబద్దలు కొట్టిన మోదీ..!!!
PM Modi: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల తామే ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమధ్య పదే పదే చాటుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర చర్చ నడిచింది. ట్రంప్ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చేశారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పినట్లు కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
జీ7 శిఖరాగ్ర సదస్సు అనుబంధంగా ప్రధాని మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు ముందుగానే వెళ్లిపోవడంతో వీరు భేటీ కాలేకపోయారు. అనంతరం వీరిద్దరూ అరగంట పాటు ఫోన్ లో సంభాషించుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ట్రంప్ ..మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో అండగా ఉంటామని తెలిపారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం ఇప్పుడే. ఆపరేషన్ సింధూర్ వివరాలనుప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి వివరించారని మిస్రీ తెలిపారు.
పహల్గాం, ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి అసలు చర్చలు జరగలేదు. భారత్ పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు జరగలేదు.కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా తెలిపారు. ఈ విషయంపై భారత్ లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని మిస్రీ వివరించారు.
కెనడా నుంచి తిరిగివెళ్తుండగా అమెరికా రావాలని ట్రంప్ మోదీని ఆహ్వానించినట్లుగా మిస్రీ తెలిపారు. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా తాను రాలేనని భారత ప్రధాని వివరించినట్లు తెలిపారు. త్వరలోనే ద్వైపాక్షికంగా భేటీ కావాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లు వెల్లడించారు. భారత్ లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్ ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు భారత్ లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారని మిస్రీ వెల్లడించారు.