Dangal Film: దంగల్‌పై నిషేధం విధించి అప్పట్లో తప్పుచేశా..పాక్ మంత్రి మరియం
Dangal Film: 2016లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేస్తేనే కానీ ఆ దేశంలో విడుదల చేయమని అప్పట్లో ఆ దేశ సెన్సార్ వెల్లడించింది.
Dangal Film: దంగల్‌పై నిషేధం విధించి అప్పట్లో తప్పుచేశా..పాక్ మంత్రి మరియం
Dangal Film: 2016లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేస్తేనే కానీ ఆ దేశంలో విడుదల చేయమని అప్పట్లో ఆ దేశ సెన్సార్ వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఇటీవల స్పందించిన పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ తన పశ్చాతాపాన్ని వ్యక్తం చేశారు. తాను సమాచార మంత్రిగా ఉన్నప్పుడు ఈ సినిమాను నిషేధించడం ఒక విచారకరమైన విషయం అని ఆమె అన్నారు.
2016లో దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఈ సినిమా విడుదల కాలేదు. కొన్ని కారణాలు చూపుతూ ఈ సినిమాను అక్కడ నిలిపివేశారు. అయితే అప్పటి సమాచార మంత్రిగా ఉన్న మరియం, సెన్సార్ బోర్డు ప్రతినిధులతో కలిసి ఈ సినమాను పాక్‌లో నిషేధించారు. అయితే దీనికి ఇప్పుడు మరియం పశ్చాతామపం పడుతున్నారు. తాను సెన్సార్ బోర్డు ప్రతినిధులు, సమాచార శాఖ అధికారులతో అదే నా మొదటి సమావేశం అని కొన్ని కారణాలవల్ల పాక్‌లో దంగల్ సినిమాను విడుదల చేయలేకపోయానని వెల్లడించారు. అంతేకాదు, ఒక సంవత్సరం తర్వాత ఆ సినిమా చూసానని, నా నిర్ణయం తప్పని అప్పుడు అర్ధం అయిందని ఆమె అన్నారు. అమ్మాయిలందరికీ ఈ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకం అని మరియం తెలిపారు.
పాక్‌లో దంగల్ సినిమా రిలీజ్ కాకపోవడంపై ఇటీవల అమీర్ ఖాన్ కూడా ఒక ఇంటర్య్వూలో స్పందించారు. ఈ సినిమాలో ఉన్న భారత జాతీయ గీతం, జెండాను తొలగించమని అప్పటి పాక్ సెన్సార్ బోర్డు చెప్పిందని, అయితే దానికి తాము ఒప్పుకోలేదని, అందుకే పాక్‌లో దంగల్ సినిమా రిలీజ్ కాలేదని ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నదేదీ తానూ ఒప్పుకోనని కూడా ఆయన అన్నారు.
2016లో నితేశ్ తివారీ డైరెక్షన్‌లో దంగల్ సినిమా వచ్చింది. మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇందులో అమీర్ ఖాన్ అద్బుతమైన నటనను ప్రదర్శించారు.