అలసత్వం ప్రదర్శించి చరిత్రలో మూర్ఖులుగా మిగలోద్దు : ఇమ్రాన్‌ఖాన్

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్..

Update: 2020-04-05 16:01 GMT
Imran Khan (File Photo)

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. కరోనా పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూర్ఖత్వం అని అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరాటంలో భాగంగా శనివారం లాహోర్‌లో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ను ప్రారంభించిన అనంతరం ఇమ్రాన్‌ ఈ వాఖ్యలు చేశారు. అమెరికా, చైనా లాంటి పెద్దపెద్ద దేశాలనే క‌రోనా వైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేసింద‌ని, నియంత్రణ పాటించ‌ని వారిని క‌రోనా మహమ్మారి వ‌దిలిపెట్టద‌ని ఇమ్రాన్ హెచ్చరించారు.

కరోనా ప్రళయం ఎప్పటికి అంతమవుతుందో నాతో సహా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారని అన్నారు. ఇక ఇప్పటికే పాక్ లో పాక్ లో కరోనా కేసులు సంఖ్య 2800కి పైగా నమోదు అయ్యాయి. క‌రోనాపై విజ‌యం సాధిద్దామ‌ని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. అలసత్వం ప్రవర్తించి చరిత్రలో మూర్ఖులుగా మిగలోద్దని అన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 205 దేశాలకు విస్తరించింది. 11.18 లక్షల మందికి కొవిడ్‌-19 వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 59,200 మందికి పైగా కరోనా బాధితులు చనిపోయారు. ఇప్పటివరకు 2.29 లక్షల మంది కోలుకున్నారు.




Tags:    

Similar News