Pakistan floods: పాకిస్తాన్‌లో ఆకస్మిక వరదలు..18 మంది గల్లంతు..వైరల్ వీడియో
Pakistan floods: పాకిస్తాన్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద పెద్ద నదులు పొంగి పోవడంతో ఊర్లను వరదలు ముంచెత్తాయి.
Pakistan floods: పాకిస్తాన్‌లో ఆకస్మిక వరదలు..18 మంది గల్లంతు..వైరల్ వీడియో
Pakistan floods: పాకిస్తాన్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద పెద్ద నదులు పొంగి పోవడంతో ఊర్లను వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వరైల్ అవుతోంది.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో ఊళ్లను అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో జనాలు కొట్టుకుపోతున్న వీడియో అందరి గుండెల్ని పిండేస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఒక కుటుంబానికి చెందిన 18మంది ఒకేసారి వరదల్లో గల్లంతవుతారు. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ అయ్యో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వీరంతా పర్యాటక ప్రాంతానికి వచ్చారని తెలుస్తోంది. నది మధ్యలో ఉండటం వల్ల ఒక్కసారి వరదల్లో కొట్టుకుపోయారని అర్ధం అవుతోంది. వరదలు వస్తున్నప్పుడు బయటకు వచ్చే దారి వీరికి కనిపించలేదు. అందుకే నీటిలో కొట్టుకుపోయారు.
గల్లంతైన వారిలో9 మంది మృతదేహాలను రెస్య్కూ సిబ్బంది వెలికి తీసారు. మిగతావారిని గాలిస్తున్నారు. మొత్తం 80 మంది సర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. స్తానికుల సమాచారం మేరకు ఈ వరదలో ఇంకా చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. నదులు పొంగి పొర్లడం వల్ల వరదలు ఒక్కసారిగా ఊళ్ల మీదకు వస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.