Operation Sindoor: పాక్ మరో ఫేక్ స్టంట్… సైమన్ క్లారిటీ..!
Pakistan Busted Again: ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత భూభాగంపై దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని పాకిస్థాన్ మరోసారి పాత పాటే పాడుతోంది.
Operation Sindoor: పాక్ మరో ఫేక్ స్టంట్… సైమన్ క్లారిటీ..!
Pakistan Busted Again: ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత భూభాగంపై దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని పాకిస్థాన్ మరోసారి పాత పాటే పాడుతోంది. ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేసి, భారత వాయుసేనకు భారీ నష్టం కలిగించామని మళ్లీ ఆరోపిస్తోంది. ఇదివరకూ కూడా ఇదే తరహాలో పాక్ ఎన్నో వదంతులు, ఫేక్ ఫొటోలు ప్రచారం చేసింది. ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామని, మార్ఫింగ్ చేసిన చిత్రాలతో ప్రచారం చేసిన విషయం విదితమే.
అయితే, ఆదంపూర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎస్-400 వ్యవస్థ వద్ద ప్రసంగించడం ద్వారా ఆ వదంతులను తిప్పికొట్టారు. అయినప్పటికీ, పాకిస్థాన్ మరోసారి ఓ ఫేక్ ఫొటోను విడుదల చేసి, ఆదంపూర్‌లోని సుఖోయ్ యుద్ధవిమానాన్ని ధ్వంసం చేశామని చెబుతోంది.
ఈ నేపథ్యంలో, ప్రముఖ జియో-ఇంటెలిజెన్స్ నిపుణుడు డేమియన్ సైమన్ తాజా స్పందన ఇచ్చారు. మార్చి 2025లో తీసిన శాటిలైట్ చిత్రాన్ని విడుదల చేసిన సైమన్… అందులో మిగ్-29 యుద్ధవిమానాన్ని మరమ్మతు సమయంలో కనపడడం, ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ వద్ద కనిపించిన నల్లటి మసి సాధారణమైనదే అని స్పష్టం చేశారు. ఈ వాదనలతో పాక్ చేసిన తాజా దుష్ప్రచారాన్ని కూడా ఖండించారు.
ఇంత వరకూ పాక్ తీసిన ప్రయత్నాలన్నీ అంతర్జాతీయంగా నవ్వులపాలవుతున్నా… దుష్ప్రచారాలకు మాత్రం వదలడం లేదు.