ప్రారంభమైన రంజాన్ మాసం‌.. పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ పొడిగింపు

Update: 2020-04-25 08:57 GMT

రంజాన్ నేపథ్యంలో పాకిస్థాన్ లో లాక్ డౌన్ ను మే 9వ తేది వరకు పొడిగించారు. ఆ దేశంలో 11, 700 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 248 మంది మరణించారు. రంజాన్ నెల మధ్య వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అసద్‌ తెలిపారు. వైరస్ పోరాటంలో కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ముస్లిం ప్ర‌జ‌ల‌కు రంజాన్ ముబాక‌ర్ చెప్పారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో.. ఈ ప‌విత్ర మాసంలో.. పేద‌ల‌ను, అణ‌గారిన వ‌ర్గాల‌కు ఏమీ చేయ‌లేక‌పోతున్న కార‌ణంగా.. అల్లాను క్ష‌మాభిక్ష కోరాల‌న్నారు.

Tags:    

Similar News