Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 56మంది..!

Pakistan Blast: పాకిస్తాన్‌లో ఇంధన ట్యాంకర్ల ప్రమాదాలు కొత్తవి కావు.

Update: 2025-04-29 16:41 GMT

Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 56మంది..!

Pakistan Blast: 2 killed and 56 injured after leaking oil టాంకర్

Pakistan Blast: బలోచిస్తాన్‌లోని నౌష్కీ జిల్లాలో లీకైన ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకుని భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 56 మందికి గాయాలయ్యాయి.

సమాచారం ప్రకారం, సోమవారం నౌష్కీ రోడ్డుపై లీకైన ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఉన్న అగ్నిమాపక సిబ్బందితో పాటు, ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు కూడా ఈ పేలుడుకు గురయ్యారు. ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు ఒక వ్యక్తి మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కరాచీకి విమానంలో తరలించారు. క్వెట్టాలోని సివిల్ హాస్పిటల్ అధికార ప్రతినిధి వసీమ్ బైగ్ తెలిపిన వివరాల ప్రకారం, పది మందికి పైగా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.

బలోచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ క్వెట్టాలో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించి, అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అధికారులను ఆదేశించారు. పాకిస్తాన్‌లో ఇంధన ట్యాంకర్ల ప్రమాదాలు కొత్తవి కావు. 2017లో పంజాబ్ రాష్ట్రంలోని అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో జరిగిన మరో ఘోర ఘటనలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం గుర్తించవచ్చు.

Tags:    

Similar News