Pakistan: భారత్ లక్ష్యంగా అణ్వాయుధాలను పాకిస్తాన్ ఆధునీకరిస్తోంది: అమెరికా సంచలన నివేదిక

Update: 2025-05-26 04:11 GMT

Pakistan: భారత్ లక్ష్యంగా అణ్వాయుధాలను పాకిస్తాన్ ఆధునీకరిస్తోంది: అమెరికా సంచలన నివేదిక

Pakistan: పాకిస్తాన్ భారతదేశంను తమ ఉనికికి ముప్పుగా ఉందని భావిస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ నివేదిక వెల్లడించింది. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ అంతగా ముఖ్యమైంది కాని భద్రత సమస్యగా పరిగణిస్తున్నట్లుతెలిపింది. ప్రపంచవ్యాప్త ముప్పులపై అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

ఈ రిపోర్టు ప్రకారం పాకిస్తాన్ సైన్యం యుద్ధభూమి అణ్యాయుధాల అభివ్రుద్ధితో సహా తన సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత్ తమ ఉనికికి ముప్పు ఉందని పాకిస్తాన్ భావిస్తోంది. భారతదేశ సాంప్రదాయ సైనిక ఆధిక్యతను ఎదుర్కొనేందుకు యుద్ధభూమిలో అణుఆయుధాల అభివ్రుద్ధి సహా తన సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. పాకిస్తాన్ కు చైనా సాయానికి ఇదో ప్రత్యేక ఉదాహరణగా చెప్పవచ్చు.

పాకిస్తాన్ తన అణు ఆయుధాగారాన్ని ఆధునీకరిస్తోందని అణు పదార్థాల భద్రతను, అణు కమాండ్, నియంత్రణను పటిష్టం చేస్తోందని కూడా నివేదిక తెలిపింది. పాకిస్తాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్య వర్తుల నుంచి సామూహిక వినాశనఆయుధాలకు సంబంధించిన వస్తువులను సేకరిస్తోందంటూ బాంబు పేల్చింది. చైనా, టర్కీ, యూఏఈల నుంచి ఆయుధాలను పాక్ దిగుమతి చేసుకుంటోందని తెలిపింది.

అంతేకాదు పాక్ ప్రధాన ప్రాధాన్యతలు ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దుల్లో జరిగే ఘర్షణలు, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ , బలూచ్ జాతీయవాద మిలిటెంట్ల దాడులు పెరుగుదల, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అణు ఆధునీకరణగా ఉంటాయని రిపోర్టు తెలిపింది. గతేడాది పాక్ లో రోజువారీ కార్యకలాపాలు ఉన్నప్పటికీ 2024లో 2,500 మందికిపైగా ప్రజలను మిలిటెంట్లు చంపినట్లు తెలిపింది. చైనా ఆర్థికంగ, సైనికంగా పాక్ ప్రధాన సహాయకుడిగా ఉందని అమెరికా ఉద్ఘాటించింది. పాకిస్తాన్ సాయుధ దళాలకు మద్దతు ఇచ్చే విదేశీ ఆయుధాలు, వస్తువులు, సాంకేతికత ఎక్కువగా చైనా నుంచి పొందినవేనని నివేదికలో పేర్కొంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే చైనా కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరుగుతుండటంతో ఆ రెండు దేశాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News