ఆస్కార్ 2021 అవార్డు వేడుక వాయిదా.. ఎన్నిరోజులంటే..

ఆస్కార్ 2021 అవార్డు వేడుకను 8 వారాల పాటు వాయిదా వేసింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2020-06-16 06:41 GMT

ఆస్కార్ 2021 అవార్డు వేడుకను 8 వారాల పాటు వాయిదా వేసింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చరిత్రలో నాలుగోసారి ఆస్కార్ వాయిదా పడినట్లయింది. దీనికి తేదీ మొదట 28 ఫిబ్రవరి 2021 న నిర్ణయించబడింది. అయితే ఇది ఇప్పుడు ఏప్రిల్ 25 న జరుగుతుంది. ఆస్కార్ 2021 అవార్డు వేడుకకోసం నామినేషన్ తేదీని కూడా డిసెంబర్ 31 నుండి ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్ణయించింది..

ఆస్కార్‌ అవార్డు వేడుక మొదటిసారిగా 1938 లో లాస్ ఏంజిల్స్‌లో ఘోరమైన వరదలు సంభవించినందున వాయిదా పడింది. ఆ తరువాత 1968 లో, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య తరువాత రెండు రోజులు ఆలస్యం అయ్యింది. 1981లో24 గంటలు నిలిపివేయబడింది. ఇక ఏదేమైనా, కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌లో జరగబోయే ఆస్కార్ వర్చువల్ ఫంక్షన్ అవుతుందా లేదా మునుపటిలా గ్రాండ్ ఈవెంట్ జరుగుతుందా అనేది ఇంకా నిర్ణయించబడలేదు.


Tags:    

Similar News