North Korea: అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ
North Korea: అమెరికా హాని తలపెడితే ఊరుకునే ప్రసక్తి లేదు
North Korea: అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ
North Korea: అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల తాము భూకక్ష్యలోకి ప్రయోగించిన నిఘా ఉపగ్రహానికి అమెరికా హాని తలపెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా మండిపడినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఒకవేళ అమెరికా అటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని తాము యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని తెలిపారు. తమచట్టబద్ధమైన అంతరిక్ష ఉపగ్రహ కార్యక్రమాలకు సంబంధించిన విధానాలను ఉల్లంఘించడానికి ప్రయత్నస్తే.. తాము కూడా అమెరికా గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేయటం, ప్రతిఘటించడానికి తమదైన వ్యూహాలను పరిశీలిస్తున్నామన్నారు.