కిమ్‌ ప్రాణాలతో లేకపోతే.. అధ్యక్షుడిగా ఆయనే సమర్థుడు

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Update: 2020-04-29 06:38 GMT
Kim Jong-Un (File Photo)

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందని బతికే అవకాశాలు లేవని అంటుంటే, మరి కొందరు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కరోనాకు భయపడే అధ్యక్షుడు అజ్ఞాత జీవితం గడుపుతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి.

అయితే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి స్పష్టమైన సమాచారం లేనందున తరువాతి అధ్యక్షుడు ఎవరనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే అధ్యక్ష పదవికి కిమ్ చిన్న చెల్లెలు కిమ్‌ యో జంగ్‌ సమర్థురాలని కథనాలు వస్తున్నాయి. అయితే ఉత్తర కొరియా సమాజంలో పురుషాధిక్యత కలిగినది. అలాంటిది ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న పులువురు విశ్లేషణలు వినబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో పేరు బయటికొచ్చింది. అది ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ వారసుల్లో ఒకరు ప్యాంగ్‌ ఇల్‌ చివరివాడు. ఇంకా చెప్పాలంటే నియంత కిమ్‌ చిన్నాన్న కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ (65)ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షుడిగా ఆయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలోని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల అనంతరం రాజకీయంగా కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ పేరు వినిపిస్తుండటం గమనార్హం. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ 1970లో ఎన్నికల్లో అన్న చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన హంగేరి, బల్గేరియా, ఫిన్‌లాండ్‌, పొలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లో పలు దౌత్యపరమైన పదవుల్లో పనిచేశారు. గత ఏడాది ఉత్తర కొరియాకు తిరిగొచ్చారు.

కాగా కిమ్‌ అనారోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో... కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ను కావాలనే పక్కన పెట్టేశారని, ఆ దేశ మీడియా అతన్ని వెలుగులోకి రానీయలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, కొందరు మేధావులు ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ కుమారుడు అయినందున కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ నిజమైన వారసుడు అని, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కానేకాదని చెప్తున్నారు. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియా అధ్యక్షుడిగా పనిచేశారు. అయన తర్వాత కిమ్‌ జోంగ్‌ ఉన్న పదవిని చేపట్టారు. ఒకవేళ కిమ్‌ ప్రాణాలతో లేకపోతే ప్యాంగ్‌ ఇల్‌ కు అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు.


Tags:    

Similar News