Nimisha Priya Case: నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా
Nimisha Priya Case: యెమెన్‌లో మృత్యుదండన ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ విషయంలో ప్రకాశవంతమైన అభివృద్ధి చోటు చేసుకుంది.
Nimisha Priya Case: నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా
Nimisha Priya Case: యెమెన్‌లో మృత్యుదండన ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ విషయంలో ప్రకాశవంతమైన అభివృద్ధి చోటు చేసుకుంది. భారత విదేశాంగ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో ఆమెకు శిక్ష అమలును వాయిదా వేశారు.
బుధవారం నిమిష ప్రియపై మరణ శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమిషంలో భారత అధికారులు, యెమెన్ జైలు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి శిక్షను తాత్కాలికంగా నిలిపివేయించగలిగారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది.
ప్రస్తుతం ఆమె పరిస్థితి, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని, భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తోందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ కొనసాగుతుండగా, నిమిష ప్రియకు న్యాయం జరగాలని ఆమె కుటుంబ సభ్యులు, సహచరులు ఆశిస్తున్నారు.