Nijjar Murder Row: భారత్ కు సంబంధం లేదని తేల్చిన కమిషన్
Nijjar Murder Row: ఖలీస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ఏజంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విరుద్దంగా నివేదికలు బయటకు వచ్చాయి.
Nijjar Murder Row: భారత్ కు సంబంధం లేదని తేల్చిన కమిషన్
Nijjar Murder Row: ఖలీస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ఏజంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విరుద్దంగా నివేదికలు బయటకు వచ్చాయి. కెనడా కమిషన్ నివేదిక మేరకు ఈ హత్యతో విదేశీ ఏజంట్ల సంబంధం లేదని తేలిందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
కెనడా ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యం అనే అంశంపై మేరీ జోసీ హోగ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మంగళవారం 123 పేజీల నివేదిక విడుదల చేసింది. మరోవైపు ఇదే నివేదిక మరో ఆరోపణ చేసింది. కెనడా ఎన్నికలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఈ నివేదిక తెలిపింది. అయితే ఈ వాదనను భారత్ తోసిపుచ్చింది. తమ అంతర్గత వ్యవహరాల్లోనే కెనడా జోక్యం చేసుకుంటుందని ఇండియా కౌంటరిచ్చింది. కెనడా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చి చెప్పింది.
దెబ్బతిన్న భారత్- కెనడా సంబంధాలు
ఖలీస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం ఏర్పడింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ట్రూడో అప్పట్లో చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఖండించింది. అసంబద్దమైన ఆరోపణలు చేస్తున్నారని ట్రూడో పై భారత్ మండిపడింది.హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18, 2023న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో హత్యకు గురయ్యారు.
నిజ్జర్ హత్యపై భారత్ పై కెనడా ఆరోపణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దౌత్యవేత్తలను రెండు దేశాలు బహిష్కరించాయి. అక్టోబరు 2024లో కెనడా నుండి ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించారు.దీనికి ప్రతీకారంగా భారత్ కూడా ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది.
ఎవరీ నిజ్జర్
కెనడాలో 2001లో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ప్లంబర్ వ్యాపారం ప్రారంభించారు. అదే సమయంలో బబ్బర్ ఖల్సా నాయకుడు జగ్ తార్ సింగ్ తారతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈయన పంజాబ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో జగ్ తార్ సింగ్ తారను 2015లో థాయ్ లాండ్ నుంచి పోలీసులు భారత్ తీసుకువచ్చారు. తారను థాయ్ లాండ్ నుంచి కెనడాకు తీసుకువచ్చేందుకు నిజ్జర్ చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. దీంతో నిజ్జర్ తిరిగి కెనడా వెళ్లారు. ఖలీస్తాన్ టైగర్ ఫోర్స్ కు ఆయన నాయకత్వం వహించారు.
అదే సమయంలో భారత్ లో కూడా తన కార్యకలాపాలు ప్రారంభించారు. ఖలీస్తాన్ టైగర్ ఫోర్స్ సభ్యుడు మన్ దీప్ సింగ్ అరెస్టుతో నిజ్జర్ ఏం చేస్తున్నారో బయటకు వచ్చింది. దీంతో ఆయనను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయనను పట్టిస్తే రూ. 10 లక్షలు ప్రకటించింది. 2021లో కమల్ దీప్ శర్మ అనే పూజారి హత్యలో కూడా నిజ్జర్ పై ఆరోపణలున్నాయి.
బ్రిటిష్ కొలంబియాకు చెందిన మహిళను నిజ్జర్ పెళ్లి చేసుకున్నారు. ఆమె అతడికి ఇమ్మిగ్రేషన్ ను స్పాన్సర్ చేసింది. తనకు ఏ సాయుధ గ్రూప్ తో సంబంధం లేదని అప్పట్లో ఆయన ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించిన ధరఖాస్తులో తెలిపారు. టెక్నికల్ కారణాలతో నిజ్జర్ ధరఖాస్తును తిరస్కరించారు. 2001లో ఆయన చేసిన అప్పీల్ ను కూడా కోర్టు తిరస్కరించింది.