అమెరికాలో COVID-19 మహమ్మారికి కేంద్రంగా న్యూయార్క్ రాష్ట్రం ఉన్న సంగతి తెలిసిందే, ప్రతిరోజు వేలాది కేసులు, మరణాలు నమోదయ్యే న్యూయార్క్ లో గత 24 గంటల్లో అతి తక్కువ సంఖ్యలో కేవలం 42 మరణాలు ,2,728 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైట్టు గవర్నర్ ఆండ్రూ క్యూమో చెప్పారు.
ఎనిమిది వారాల క్రితం రికార్డు స్థాయిలో 800 మంది నుండి కోవిడ్ -19 కు బలవ్వగా.. గురువారం రాష్ట్రం 42 మందిని మాత్రమే కోల్పోయింది. మహమ్మారి గరిష్ట సమయంలో రికార్డు స్థాయిలో 18,825 నుండి మొత్తం ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 2,728 కు తగ్గిందని క్యూమో తన రోజువారీ వార్తా సమావేశంలో చెప్పారు.
కాగా న్యూయార్క్ రాష్ట్రంలో మొత్తం 376,208 కేసులు ధృవీకరించబడ్డాయి, ఏప్రిల్‌లో దాదాపు వెయ్యి రోజువారీ మరణాలను నమోదు చేసింది.. అయితే మే చివరి నుండి రోజువారీ మరణాల సంఖ్య 100 మార్కు కంటే తక్కువగా ఉంది. ఇదిలావుంటే జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం, యుఎస్ లో 1.8 మిలియన్లకు పైగా COVID-19 ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, 109,000 మందికి పైగా మరణించారు.