దక్షిణకొరియాలో తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా..

దక్షిణకొరియాలో కరోనావైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది.. మరోసారి కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

Update: 2020-05-10 03:01 GMT

దక్షిణకొరియాలో కరోనావైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది.. మరోసారి కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కొత్త ఇన్ఫెక్షన్ల కారణంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో శనివారం 2,100 కి పైగా బార్‌లు ,ఇతర నైట్‌స్పాట్‌లను మూసివేయబడ్డాయి.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ నైట్ క్లబ్‌లు, హోటళ్లు, బార్‌లు , డిస్కోలను తెరవవద్దని ప్రభుత్వం ఆదేశించింది. వాస్తవానికి దక్షిణకొరియాలో గతనెలే లాక్ డౌన్ ను సడలించారు. దాంతో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు.

ఈ క్రమంలో కొంతమంది సామాజిక దూరాన్ని పాటించలేదని అందువల్ల కొత్త వైరస్ కేసులు నమోదు అవుతున్నాయని ఓ అధికారి అంగీకరించారు. ఈ కారణంగా, ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో పడతారని.. ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఇదిలావుంటే ఇప్పటివరకూ దక్షిణకొరియాలో మొత్తం 10,874 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.. ఇందులో 9,610 మంది కోలుకోగా.. 256 మంది వ్యాధి భారిన పడి మరణించారు. ఇక ప్రస్తుతం వెయ్యికిపైగా యాక్టీవ్ కేసులున్నాయి.


Tags:    

Similar News