NASA: ఎగిరే పళ్లాలపై నాసా పరిశోధనలు
NASA: ఈ విశ్వంలో భూమి మీద కాకుండా.. ఇంకెక్కడైనా జీవులు ఉన్నారా?
NASA: ఈ విశ్వంలో భూమి మీద కాకుండా.. ఇంకెక్కడైనా జీవులు ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? వారి భాషేమిటి? వాళ్లు మనకంటే గొప్పగా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలు మనిషిని నిత్యం తొలిచేస్తున్నాయి. ఇతర గ్రహాల్లో ఎక్కడో మనుషులు ఉంటారని వారు భూమిపైకి వచ్చి వెళ్తుంటారని కొందరు వాదిస్తున్నారు. వారు వచ్చే వాహనాలు ఎగిరే పళ్లాల ఉంటాయని చెబుతున్నారు. అయితే ఆకాశంలో బొంగరంలా తిరుగుతూ క్షణాల్లో మాయమయ్యే అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్-యూఎఫ్‌వోలపై ప్రశ్నిస్తే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది.
గొప్ప గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు కూడా దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అందరూ ఊహించుకొంటున్నట్టుగా అవి గ్రహాంతరవాసుల వాహనాలా? అంటే అదీ తెలియదు. సర్వ మానవాళికి అంతుచిక్కకుండా భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న యూఎఫ్‌వోల నిగ్గు తేల్చేందుకు నాసా నడుం బిగించింది. ఆ ఎగిరే పళ్లాలు ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయ్? అని తెలుసుకొనేందుకు 16 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం 9 నెలల పాటు యూఎఫ్‌వోలపై పరిశోధన చేసి నివేదికను సమర్పించనుంది. ఈ నెల 24 నుంచే అన్వేషణను నాసా శాస్త్రవేత్తల బృందం ప్రారంభించనున్నది.