Pakistan: అడుక్కుతినే బతుకు.. పాక్ బెగ్గర్స్ నీ తరిమేసిన సౌదీ..!!

Update: 2025-05-16 14:44 GMT

Pakistan: అడుక్కుతినే బతుకు.. పాక్ బెగ్గర్స్ నీ తరిమేసిన సౌదీ..!!

Pakistan: పాకిస్తాన్ బిచ్చగాళ్లు దాన్ని మిత్ర దేశాలను హడలెత్తిస్తున్నారు. యాచకులను ఎగుమతి చేసే దేశంగా పాకిస్తాన్ అపకీర్తిని మూటగట్టుకుంది. తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్ కు చెందిన 5,033 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగ పంపించేసింది. మరో 3690 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీ లో వెల్లడించినట్లు డాన్ పత్రిక కథనంలో పేర్కొంది.

2024 జనవరి నుంచి తమ మిత్రదేశాలు వెళ్లగొట్టిన పాకిస్తాన్ బిచ్చగాళ్ల సంఖ్యను కలుపుకుంటే ఇది 5,402కు చేరిందని వెల్లడించింది. వీరిన పంపించిన వారిలో సౌదీతోపాటు..ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఈఏ ఉండటంతో ఈ మొత్తంలో సింధి ప్రావిన్స్ కు చెందినవారు 2,795 మంది, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1437, కేపీ నుంచి 1,002, బలోచిస్తాన్ 125, పీవోకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారు.

పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ ఏప్రిల్ 19న సియాల్ కోట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో యాచన ఓ పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. దీని వల్ల ఇతర దేశాలు వీసాలు జారీ చేయడం లేదని తెలిపారు. దేశంలో దాదాపు 3కోట్ల మంది యాచకులు ఉన్నట్లు తెలిపారు. వీరి నెలసరి ఆదాయం 4,200 కోట్ల పాకిస్తాన్ రూపాయలు అని ఆయన వెల్లడించారు. సియాల్ కట్ నుంచి వారిని రెండుసార్లు ఏరవేర్చినట్లయితే మళ్లీ తిరిగి వచ్చారన్నారు.

2023లో పాకిస్తాన్ సెనెట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫీకర్ హైదర్ మాట్లాడారు. విదేశాల్లో అరెస్టు అవుతున్న 90శాతం బిచ్చగాళ్లు పాకిస్తాన్ కు చెందినవారని వెల్లడించారు. చాలా మంది యాత్రికుల వీసాలను తీసుకుని సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి ప్రదేశాలకు వెళ్లి అడుక్కుంటున్నట్లు తెలిపారు. వీరికి జపాన్ కొత్త కేంద్రంగా మారుతుందని అప్పట్లో చెప్పారు. 

Tags:    

Similar News