Burkina Faso: 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన మిలటరీ
Burkina Faso: ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉగ్రవాద సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్తర బుర్కినా ఫాసోలో ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. సహాయ కార్యకర్తలు, స్థానిక నివాసితులు అందించిన సమాచారం ప్రకారం, మరణించిన వారిలో ఎక్కువ మంది సైనికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దాడి ఆదివారం ఉదయం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. జిహాదీలు సైనిక స్థావరం, చాలా కాలంగా ముట్టడి చేయబడిన వ్యూహాత్మక పట్టణం జిబోతో సహా అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగింది. అయితే ఈ దాడిలో సైనికులతోపాటు దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.