Australia: ఆస్ట్రేలియాలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత
Australia: న్యూ సౌత్‌వేల్స్‌లోని డార్లింగ్ నదిలో భయానక దృశ్యాలు
Australia: ఆస్ట్రేలియాలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత
Australia: ప్రకృతి ప్రకోపానికి మనుషులేకాదు.. మూగజీవాలు బలవుతున్నాయి. ఆకస్మిక వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుఫాను, భూకంపాలతో ప్రాణకోటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ నదిలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్ట్రేలియాలో రెండో పొడవైన నదిగా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపంలోగల డార్లింగ్ నది పేరు గాంచింది. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని సిడ్నీకి పశ్చిమాన వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నదిలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర చేపలు నిర్జీవంగా తేలియాడుతున్న దృశ్యాలే. వరద నీరు తగ్గడం, వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోవడమే భారీ స్థాయిలో చేపల మృత్యువాతకు కారణమని అధికారులు తెలిపారు.