Metro Train: వంతెనపై నుంచి కిందపడ్డ మెట్రో రైలు
Metro Train: మెక్సికో నగరంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
Metro Train: వంతెనపై నుంచి కిందపడ్డ మెట్రో రైలు
Metro Train: మెక్సికో నగరంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలు వంతెన ప్రమాదవశాత్తు కూలిపోవడంతో రైలు బోగీలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మెట్రో రైలు వంతెన కింద ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. వెంటనే అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెట్రో లైన్ పురాతనమైనదని, ఆ లైన్‌లో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే ప్రమాదం సంభవించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.