Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మారోసారి భారీ భూకంపం

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మారోసారి భారీ భూకంపం సంభవించింది.

Update: 2025-11-03 07:36 GMT

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మారోసారి భారీ భూకంపం 

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మారోసారి భారీ భూకంపం సంభవించింది. ఆగస్టులో సంభవించిన భూకంపం మరువకముందే.. ఉత్తర అఫ్ఘన్‌లో మజార్-ఎ-షరీఫ్ సమీపంలో భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. ఈ భూకంపం వల్ల వందలాది మందికి ప్రాణనష్టం జరగడంతో పాటు, విపత్తు తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది.

సుమారు 5లక్షల 23 వేల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో యూఎస్‌జీఎస్ తన పేజర్ వ్యవస్థలో 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. భూకంపం వల్ల జరిగిన నష్టం, మృతుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆఫ్ఘనిస్థాన్‌ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడు దేశాలైన తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ లలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.

Tags:    

Similar News