Mass shooting in Mexico: మెక్సికోలో కాల్పుల మోత.. 12 మంది మృతి.. వీడియో ఇదిగో!

Mass shooting in Mexico: మెక్సికోలోని గ్వానాజువాటో సిటీలో సంబరాలు రక్తసిక్తంగా మారాయి. ఇరాపువాటో పట్టణంలో జరిగిన సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ ఉత్సవాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-06-26 02:49 GMT

Mass shooting in Mexico: మెక్సికోలో కాల్పుల మోత.. 12 మంది మృతి.. వీడియో ఇదిగో!

Mass shooting in Mexico: మెక్సికోలోని గ్వానాజువాటో సిటీలో సంబరాలు రక్తసిక్తంగా మారాయి. ఇరాపువాటో పట్టణంలో జరిగిన సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ ఉత్సవాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలు స్థానికంగా మద్యం, డ్యాన్స్‌తో ఉత్సాహంగా నిర్వహించబడుతుండగా, కొంతమంది దుండగులు గన్స్‌తో ప్రత్యక్షమై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ దాడిలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ దారుణ ఘటనకు కాసేపు ముందే ఒక గృహ సముదాయ డాబాపై బ్యాండ్ వాయిద్యాల మధ్య స్థానికులు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వేడుకలు ఉత్సాహంగా సాగుతుండగానే అర్థరాత్రి దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

ఇరాపువాటో మున్సిపల్ అధికారి రోడాల్ఫో గ్మెజ్ సెర్వంటెస్ ఈ ఘటనను ధృవీకరిస్తూ, 12 మంది మృతి చెందారని, దాదాపు 20 మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

గ్వానాజువాటో రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా మెక్సికోలో అత్యధిక హింసాత్మక సంఘటనలతో తీవ్ర స్థాయిలో ప్రభావితమవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,435 హత్యలు నమోదయ్యాయి.



Tags:    

Similar News