Masood Azhar: ఉగ్రవాది మసూద్ అజార్‌కు రూ.14 కోట్ల నష్టపరిహారం!
Masood Azhar: భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి విరుచుకుపడింది.
Masood Azhar: ఉగ్రవాది మసూద్ అజార్‌కు రూ.14 కోట్ల నష్టపరిహారం!
Masood Azhar: భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో అనేక మంది టెర్రరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన 14 మంది మృతి చెందడం గమనార్హం.
ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందజేస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ప్రకారం, మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు నష్టపరిహారం వచ్చే అవకాశముంది.
వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరదలు, మరో ఐదుగురు చిన్నారులు మృతిచెందినట్లు మసూద్ అజార్ ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మసూద్ అజార్ ఫ్యామిలీలో ప్రస్తుతం అతనొక్కడే బ్రతికి ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ 14 మందికి అతనే వారసుడు కాబట్టి, పాకిస్థాన్ ప్రభుత్వం ఇచ్చే రూ. 14 కోట్లు అతనికే దక్కుతాయని అంచనా వేస్తున్నారు.