భారత్‌తో సుంకాల వివాదం.. పాక్‌తో అమెరికా సంబంధాలు

Marco Rubio: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు బలపడటం, అదే సమయంలో సుంకాల వివాదంతో భారత్ తో అగ్రరాజ్యం సంబంధాలు దెబ్బతిన్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-10-27 08:56 GMT

భారత్‌తో సుంకాల వివాదం.. పాక్‌తో అమెరికా సంబంధాలు

Marco Rubio: పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు బలపడటం, అదే సమయంలో సుంకాల వివాదంతో భారత్ తో అగ్రరాజ్యం సంబంధాలు దెబ్బతిన్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. కౌలాలంపూర్‌లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో భేటీ కానున్న నేపథ్యంలో ఆయన ముచ్చటించారు.‘‘పాక్‌తో అమెరికా సంబంధాలపై కొన్ని కారణాల రీత్యా భారత్‌కు ఆందోళనలు ఉన్నాయని.. వేర్వేరు దేశాలతో సంబంధాలు ఉండాలనేది భారత్‌ అర్థం చేసుకోవాలన్నారు. పాక్‌తో వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో వారికి అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

Tags:    

Similar News