Afghanistan earthquake: ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం..ఢిల్లీలోనూ ప్రకంపనలు

Update: 2025-04-16 01:25 GMT

Earthquake: పాకిస్తాన్, ఇండోనేషియాలో భారీ భూకంపం..భూకంప తీవ్రత ఎంతంటే?

Afghanistan earthquake: భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో బలమైన భూకంపం సంభవించింది . బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ భూకంప కేంద్రం (EMSC) తెలిపింది. భూకంప కేంద్రం 121 కిలోమీటర్ల (75 మైళ్ళు) లోతులో ఉంది. బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. ఈ భూకంప తీవ్రత ఢిల్లీ ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది.

గత నెల మార్చి 29న కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం కాబూల్ సమీపంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు, పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాలలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది.మార్చి 29కి ముందు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో బలమైన భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఈ అర్థరాత్రి భూకంపం కారణంగా, చాలా మంది ప్రజలు తమ ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, వినాశకరమైన భూకంపం అక్టోబర్ 10, 2005న సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. పాకిస్తాన్ కాశ్మీర్ ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ భూకంపం ప్రభావం ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఈ విషాదంలో వందలాది మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది ఇళ్ళు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర భవనాలు ధ్వంసమయ్యాయి.

Tags:    

Similar News