Earthquake: పాకిస్తాన్, ఇండోనేషియాలో భారీ భూకంపం..భూకంప తీవ్రత ఎంతంటే?

Update: 2025-05-01 00:56 GMT

Earthquake: పాకిస్తాన్, ఇండోనేషియాలో భారీ భూకంపం..భూకంప తీవ్రత ఎంతంటే?

Earthquake: ఒకవైపు పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం దాడి చేస్తుందనే భయం.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు పాకిస్తాన్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దేవుడు కూడా పాకిస్తాన్ పట్ల దయ చూపడం లేదు. బుధవారం రాత్రి పాకిస్తాన్‌లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, బుధవారం 21:58:26 (IST) గంటలకు పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. భూకంప ప్రకంపనలు బలంగా ఉండటంతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ తరువాత ఇప్పుడు ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.10గా నమోదైంది.

ఇండోనేషియా భూమి కంపించింది. భూకంప హెచ్చరిక ప్రకారం, ఈ భూకంపం మే 1న ఉదయం 5:08 గంటలకు సంభవించింది. భూకంప ప్రకంపనలకు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.10గా నమోదైంది. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. భూకంప కేంద్రం ఉత్తరం వైపున 278 కిలోమీటర్ల లోతులో ఉంది.

ఇండోనేషియాకు కొన్ని గంటల ముందు పాకిస్తాన్‌లో కూడా భూకంపం సంభవించింది. నిన్న రాత్రి పాకిస్తాన్ భూమి బలమైన భూకంపాలతో వణికిపోయింది. ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. ఒక క్షణం అక్కడి ప్రజలు భారతదేశం దాడుల వల్ల భూమి కంపిస్తున్నట్లు భావించారు. పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం కఠిన వైఖరి కారణంగా పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. 



Tags:    

Similar News